Indiramma housing scheme: వారికి బిగ్ షాక్ ఇవ్వనున్న తెలంగాణ సర్కార్..ఇందిరమ్మ ఇళ్లు రద్దు?
Indiramma Housing Scheme
Indiramma housing scheme: 2004 నుంచి 2014 వరకు అమలు అయిన ఇందిరమ్మ ఇళ్ల స్కీములో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని..దానిపై సమగ్ర విచారణ జరపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎఫ్ జీజీ అధ్యక్షుడు ఎం పద్మనాభ రెడ్డి బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2004-2014 కాలంలో 33.4లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం 20.49లక్షల ఇళ్లు పూర్తయినట్లు చూపించిందని పేర్కొన్నారు. అయితే అందులో చాలా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోయినా పూర్తయినట్లు కాగితాలపై చూపించారని..మరికొన్ని ఇళ్ల పనులు మొదలుకాకుండానే పూర్తయినట్లు చూపించారని, కొన్ని నిర్మాణాలు సగంలోనే నిలిచిపోయాయని వివరించారు.
ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినప్పటికీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే అవినీతికి మరింత అవకాశం కల్పించిందన్నారు.
ఇండ్లులేని పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని కోరారు. ఉమ్మడి ఏపీలో 2004-2014 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా..ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని దీనిపై వెంటనే విచారణ జరిపి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2004-2014 మధ్య జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ విచారణ పూర్తి స్థాయిలో జరగలేదని..రాష్ట్రంలోని 12వేల గ్రామాల్లో కేవలం 36 గ్రామాలనే సందర్శించి విచారణ తూతూ మంత్రంగా ముగించారని విమర్శలు చేశారు. దీంతో అవినీతి పనులు చేలరేగిపోతున్నాయని పేర్కొన్నారు.