తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. ఒక్కో కుటుంబానికి రూ.1500

కరోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ న‌డుస్తోంది. దీంతో పేదలకు ఉపాధి ఆగిపోయింది.

Update: 2020-04-14 04:04 GMT
kcr (File Photo)

కరోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ న‌డుస్తోంది. దీంతో పేదలకు ఉపాధి ఆగిపోయింది. వ‌ల‌స కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కేసీఆర్ స‌ర్కార్ ప్రతి కుటుంబానికి రూ.1500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు దారుల‌కు రూ.1500 అందించనున్నారు. ఈ డబ్బు అర్హుల బ్యాంక్ ఖాతాల్లో మంగళవారం జమకానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 74లక్షలకుపైగా అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని కేటీఆర్ ట్విట్ చేశారు. ప్రభుత్వం బ్యాంకులకు మొత్తం రూ.1,112 కోట్లను బదిలీ చేసినట్లు చెప్పారు.

ఈ నిధులు ప్ర‌భుత్వం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో జమ చేసింది. మంగళవారం అంబేద్కర్‌ జయంతి కావడంతో బ్యాంకులకు సెలవు.. బుధవారం నుంచి చెల్లింపులు చేయనున్నారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా... ఆధార్‌ పేమెంట్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్‌ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. అయితే .. ఏటీఎం కార్డులు ఉన్నవారు సెల్ కు సందేశం వచ్చిన వెంటనే డబ్బులు తీసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డుదారుల‌ వివరాలను సేకరించిన ప్రభుత్వం... ఆ డేటాతో సివిల్‌ సప్లైస్‌ వద్ద ఉన్న డేటాను స్క్రీనింగ్ చేశారు. తెల్ల రేష‌న్ కార్డు లేని వారి కుటుంబ సభ్యుల్లో ఒకరి బ్యాంకు అకౌంట్‌ వివరాలను తీసుకున్నారు. రేషన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం అయి ఉండి, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ లేనివారికి రెండో విడతలో 1500రూపాయ‌లు ఇవ్వ‌నున్న‌ట్లు నిర్ణయించారు


Tags:    

Similar News