ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన: భట్టి విక్రమార్క

ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన నిర్వహిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు.

Update: 2025-02-12 13:19 GMT

ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన: భట్టి విక్రమార్క

ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన నిర్వహిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. గతంలో సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. బుధవారం ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మార్చి తొలి వారంలో కేబినెట్ తీర్మానం చేస్తుందన్నారు. ఆ తర్వాత ఈ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలను కలుస్తామని ఆయన అన్నారు. దీనిపై తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని పోతామని డిప్యూటీ సీఎం చెప్పారు.

కుల గణన సర్వే రిపోర్టుకు సంబంధించి ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం రిపోర్టు ప్రవేశ పెట్టింది. బీసీ జనాభా తగ్గిందని విపక్షాలు ఆరోపణలు చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. ఓసీల జనాభా ఐదు శాతం లా పెరిగిందని ప్రశ్నించాయి. అయితే బీసీల జనాభా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వాదన. మరోవైపు మూడు లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. ఇందులో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవారే ఎక్కువ. దీంతో మరోసారి కుల గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు ఛాన్స్?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రిజర్వేషన్ల విషయంలో మరోసారి కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News