New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్.. వారికి రేషన్ కార్డు రావు.. ఉన్నవి కట్?
Telangana government takes key decision on new ration cards
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సాఫ్ట్ వేర్ ఉపయోగించి అర్హులను ఎంపిక చేయనుంది. ఇదే జరిగితే రాష్ట్రంలో లక్షల మందికి ఉన్నరేషన్ కార్డులు పోయే పరిస్థితి రావడం ఖాయమనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 10ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడంతో వేలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త కార్డుల మంజూరు నిలిచిపోవడంతో..అందులో చేర్పులు, మార్పులు చేయించుకోవడానికి ప్రజలు సర్వేలు, దరఖాస్తుల కోసం తిరుగుతున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ చేపట్టి..ఆమోద ప్రక్రియను ప్రారంభించింది. అయితే కార్డుల మంజూరు వేగంగా జరగకపోవడంతో కొత్త నిబంధనలతో ప్రజల్లో నిరాశ ఎక్కువగా పెరిగింది.
ఈ సారి ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. 360 డిగ్రీ సాఫ్ట్ వేర్ సాయంతో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఆదాయ వివరాలను ఆధార్ కార్డు ద్వారా స్కాన్ చేస్తున్నారు. దరఖాస్తుదారులకు కారు, ఇల్లు, ప్లాట్లు ఉన్నాయా అనే విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నవారి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు అధికారులు. దీంతో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలకు కార్డులు మంజూరు కావడం లేదు. ప్రభుత్వం లెక్కిస్తున్న ఆదాయ విధానం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్డుల మంజూరులో సడలింపులు ఇచ్చి, అందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గత 10ఏళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఇప్పుడు వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా పెళ్లైన జంటలు, కుటుంబ మార్పులు జరిగినవారు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. కానీ మంజూరు ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో నిబంధనలతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఆదాయ వివరాలను ఆధార్ కార్డు ఆధారంగా పరిశీలిస్తున్నారు. కారు, ఇల్లు, ప్లాట్లు ఉన్నవారు తిరస్కరణ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల్లో కార్డులు మంజూరుపై అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం ఆదాయ లెక్కింపు విధానం తగినంత స్పష్టత లేకుండా చేయడం వల్ల అర్హులైన వారు కూడా కార్డుల కోసం ఎదురూచూడాల్సి వస్తుంది.
కొత్తగా ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి స్కీములను అమలు చేసింది. ఇందిరమ్మ ఇళ్లు పొందినవారికి , కొత్త రేషన్ కార్డులు మంజూరైన వారికి వచ్చే నెల నుంచి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. అయితే జిల్లాల వ్యాప్తంగా వేలాదిగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం ఇంకా దొరకడం లేదు. 10ఏళ్లుగా దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటికీ కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుందో అనే అనుమానం ప్రజల్లో నెలకొని ఉంది.