సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా సిద్ధిపేటలోనూ ఐటీ టవర్స్ నిర్మించాలని నిర్ణయించింది.

Update: 2020-12-06 10:32 GMT

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా సిద్ధిపేటలోనూ ఐటీ టవర్స్ నిర్మించాలని నిర్ణయించింది. సిద్ధిపేట సమీపంలోని దుద్దెడ గ్రామం వద్ద 45 కోట్లతో ఐటీ టవర్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో ఐటీ టవర్స్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్స్‌టిట్యూట్, టూరిజం హోటల్ మధ్యలో రాజీవ్ రహదారిని ఆనుకుని సువిశాల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టనుంది. ఐటీ టవర్‌కు ఈ నెల 10న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది

Tags:    

Similar News