TSRTC: ఆర్టీసీ యూనియన్లపై తెలంగాణ ప్రభుత్వం విధించిన రెండేళ్ల నిషేధం గడువు పూర్తి

* ఈ నెలతో ముగియనున్న సీసీఎస్ పాలకమండలి కాలపరిమితి * యూనియన్ల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోని తెలంగాణ ప్రభుత్వం

Update: 2021-11-16 02:49 GMT

ఆర్టీసీ యూనియన్లపై తెలంగాణ ప్రభుత్వం విధించిన రెండేళ్ల నిషేధం గడువు పూర్తి(ఫోటో-ది హన్స్ ఇండియా)

TSRTC: తెలంగాణ ఆర్టీసీ యూనియన్లపై ప్రభుత్వం విధించిన రెండేళ్ల నిషేధం గడువు పూర్తయ్యింది. కానీ సంఘం ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు సీసీఎస్ పాలకమండలి కాలపరిమితి ఈ నెలతో ముగియనుంది. దాని ప్లేస్ లో పీఏసీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఆర్టీసీ అభివృద్ధికి ఎండీ సజ్జనార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేత హన్మంతు ముదిరాజ్ తెలిపారు. యూనియన్ల బదులు ముఖ్యమంత్రి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదన్నారు. 2017 నుంచి రెండు వేతన సవరణలు 5డీఏలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతి సంస్థకు యూనియన్లు ఎంతో కీలకం. యూనియన్లపై ఉక్కుపాదం మోపుతూ కార్మిక చట్టానికి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ఈసారి ప్రభుత్వం యూనియ‌న్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందో లేదో చూడాలి. 

Tags:    

Similar News