Sridhar Babu: జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది
Sridhar Babu: జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి కట్టుబడితో ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Sridhar Babu: జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి కట్టుబడితో ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కంది ఐఐటీ హైదరాబాద్ లో టెక్నో సంస్కృతిక ఉత్సవాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఖాళీల వివరాలు ముందుగానే ప్రకటించి నిరుద్యోగుల్లో నమ్మకం కల్పిస్తామన్నారు.
త్వరలోనే అన్ని శాఖలలోని ఉద్యోగాల వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిరుగ్యోగులను బిఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుదోవ పాటిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ నేతలు నిరుద్యోగుల గురించి మాట్లాడితే దయ్యాలువేదలు పలికినట్లు ఉందన్నారు. నిరుద్యోగులకు తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చెస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.