TSLPRB: తెలంగాణ ఎక్సైజ్, రవాణా శాఖ పోస్టుల భర్తీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కే అప్పగింత..!

TSLPRB: రాష్ట్రంలో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అప్రూవల్​ ఇచ్చింది. పోలీసు శాఖ, జైళ్ల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖల్లో పోస్టులకు పర్మిషన్ ఇచ్చింది.

Update: 2022-04-09 11:00 GMT

TSLPRB: తెలంగాణ ఎక్సైజ్, రవాణా శాఖ పోస్టుల భర్తీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కే అప్పగింత..!

TSLPRB: రాష్ట్రంలో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అప్రూవల్​ ఇచ్చింది. పోలీసు శాఖ, జైళ్ల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖల్లో పోస్టులకు పర్మిషన్ ఇచ్చింది. శాఖల వారీగా పోస్టుల సంఖ్యపై జీవోలిచ్చింది. మొత్తం 80,039 వేకెన్సీ పోస్టుల్లో తొలివిడుతగా 30,453 పోస్టులకు పర్మిషన్ ఇచ్చామని ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే చర్చించి మిగతా ఉద్యోగాలకు అనుమతి ఇస్తామని మంత్రి హరీశ్​రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) ఇప్పటి వరకు కేవలం పోలీస్‌ నియామకాలను మాత్రమే చేపట్టేది. ఇప్పుడ దీని పరిధిని విస్తరించారు. అదనంగా కొన్ని శాఖల పోస్టుల భర్తీ అప్పజెప్పారు.

కొత్తగా ఎక్సైజ్, రవాణా శాఖ సిబ్బంది నియామక బాధ్యతలనూ ఈసారి TSLPRBకి అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్సైజ్‌ సిబ్బంది నియామకాలను ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగేవి. అలాగే రవాణా శాఖ సిబ్బంది నియామకాలు TSPSC నిర్వహించేది. బోర్డు ఆధ్వర్యంలో జరిగే నియామక ప్రక్రియ పకడ్బందీగా ఉండటానికితోడు ఎక్సైజ్, రవాణా శాఖలోనూ యూనిఫాం సర్వీసెస్‌కే చెందిన సిబ్బందిని నియమించాల్సి ఉన్నందున టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

17,000 పోలీస్, 212 రవాణా పోస్టులుండటంతో మండలి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు చేపట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడటమే ఆలస్యం నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉంది. తొలుత ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకోసం ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమైంది. కీలకమైన పరుగు పందెంలో పాల్గొనే అభ్యర్థులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(RFID) ట్యాగ్‌లను అమర్చడం ద్వారా అక్రమాలను నియంత్రిస్తున్నారు.

Tags:    

Similar News