India Post GDS Recruitment 2026: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇండియా పోస్ట్‌లో 28,740 ఉద్యోగాలు.. కేవలం 10వ తరగతి మార్కులతోనే ఎంపిక!
India Post GDS Recruitment 2026: ఇండియా పోస్ట్ 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతో, ఎలాంటి పరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
India Post GDS Recruitment 2026: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇండియా పోస్ట్‌లో 28,740 ఉద్యోగాలు.. కేవలం 10వ తరగతి మార్కులతోనే ఎంపిక!
India Post GDS Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇండియా పోస్ట్ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) పోస్టులు ఉన్నాయి.
ముఖ్యమైన సమాచారం: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల 10వ తరగతి మార్కుల ఆధారంగా రూపొందించే మెరిట్ లిస్ట్ ద్వారానే తుది ఎంపిక ఉంటుంది.
అర్హతలు మరియు వయస్సు:
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (Ssc) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది).
జీత భత్యాలు:
BPM పోస్టులకు: నెలకు రూ. 12,000 నుండి రూ. 29,380 వరకు.
ABPM/GDS పోస్టులకు: నెలకు రూ. 10,000 నుండి రూ. 24,470 వరకు వేతనం లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: జనవరి 31, 2026.
దరఖాస్తుల ప్రారంభం: జనవరి 31, 2026.
చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026.
దరఖాస్తు సవరణ (Correction window): ఫిబ్రవరి 18 - 19, 2026.
మెరిట్ జాబితా విడుదల: ఫిబ్రవరి 28, 2026.
దరఖాస్తు చేసుకునే విధానం: అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in సందర్శించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.