TG TET Results 2026: తెలంగాణ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల తేదీ ఖరారు!

తెలంగాణ టెట్ 2026 పరీక్షల ఫలితాల అప్‌డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య ఫలితాలు విడుదల కానున్నాయి. రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం ఇక్కడ చూడండి.

Update: 2026-01-16 07:12 GMT

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) రాస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టెట్ పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చేసింది.

పరీక్షల వివరాలు:

తెలంగాణ వ్యాప్తంగా 18 జిల్లాల్లోని 97 కేంద్రాల్లో టెట్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా జరుగుతున్నాయి.

దరఖాస్తులు: ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇన్-సర్వీస్ టీచర్లు: వీరిలో సుమారు 71,670 మంది ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కావడం విశేషం.

ముగింపు: ఈ నెల జనవరి 20వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తి కానున్నాయి.

ఫలితాలు ఎప్పుడంటే..?

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు ముగిసిన వెంటనే ప్రాథమిక కీ (Preliminary Key) విడుదల చేస్తారు. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఫలితాలను వెల్లడిస్తారు.

ఫలితాల విడుదల: ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ మధ్య ఫలితాలు వెలువడనున్నాయి.

ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు తమ స్కోరు కార్డును అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఇక్కడ ఉంది:

  1. మొదట అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ను సందర్శించాలి.
  2. హోమ్ పేజీలో కనిపించే 'TG TET January - 2026 Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ హాల్ టికెట్ నంబర్, పేపర్ వివరాలు (Paper 1 or 2) మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
  4. 'Submit' బటన్ నొక్కగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  5. భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్ కాపీని ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోండి.
Tags:    

Similar News