IAF Agniveer Vayu Recruitment: ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో దేశ సేవ చేసే అవకాశం!

IAF Agniveer Vayu Recruitment 2026: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నివీర్ వాయు 01/2027 బ్యాచ్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్, డిప్లొమా అర్హత ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఫిబ్రవరి 1 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Update: 2026-01-14 12:30 GMT

IAF Agniveer Vayu Recruitment: ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో దేశ సేవ చేసే అవకాశం!

IAF Agniveer Vayu Recruitment 2026: భారత వైమానిక దళంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు (ఇన్‌టేక్ 01/2027) నియామకాల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ముఖ్యమైన సమాచారం:

దరఖాస్తు ప్రారంభం: జనవరి 12, 2026

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 01, 2026 (రాత్రి 11 గంటల వరకు)

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి 30, 31 (2026)

దరఖాస్తు రుసుము: రూ. 550 + GST

అర్హతలు ఏంటి?

వయోపరిమితి: అభ్యర్థులు జనవరి 01, 2006 మరియు జూలై 01, 2009 మధ్య జన్మించి ఉండాలి.

విద్యార్హత: 1. సైన్స్ సబ్జెక్టులు: ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50% మార్కులు (ఇంగ్లీష్‌లో విడిగా 50% మార్కులు) ఉండాలి. 2. ఇతర సబ్జెక్టులు: ఏదైనా గ్రూపుతో ఇంటర్ పూర్తి చేసి 50% మార్కులు సాధించిన వారు కూడా అర్హులే. 3. డిప్లొమా: ఇంజనీరింగ్‌లో (మెకానికల్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ సైన్స్ మొదలైనవి) మూడేళ్ల డిప్లొమా చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ (3 దశల్లో):

ఫేజ్-1: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష.

ఫేజ్-2: శారీరక దారుఢ్య పరీక్ష (PFT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు అడాప్టబిలిటీ టెస్టులు.

పురుషులు: 1.6 కి.మీ రన్నింగ్‌ను 7 నిమిషాల్లో పూర్తి చేయాలి.

మహిళలు: 1.6 కి.మీ రన్నింగ్‌ను 8 నిమిషాల్లో పూర్తి చేయాలి.

ఫేజ్-3: మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్.

జీతభత్యాలు: ఎంపికైన అగ్నివీర్లకు మొదటి ఏడాది నెలకు రూ. 30,000 జీతం లభిస్తుంది. నాలుగో ఏడాది నాటికి ఇది రూ. 40,000కి పెరుగుతుంది. నాలుగేళ్ల సేవ అనంతరం 'సేవా నిధి' ప్యాకేజీ కింద సుమారు రూ. 10.04 లక్షలు అందుతాయి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://iafrecruitment.edcil.co.in సందర్శించి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

Tags:    

Similar News