CEO Vikas Raj: 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
CEO Vikas Raj: కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు.
CEO Vikas Raj: 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
CEO Vikas Raj: కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠ భద్రత ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది అని సీఈవో తెలిపారు.