TG News: పిల్లలకు వాడే సిరప్ ప్రమాదకరం.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అలర్ట్
Telangana Drugs Control : పిల్లలకు ఉపయోగించే ‘ఆల్మంట్ కిడ్ సిరప్’ వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TG DCA) ఆదేశాలు జారీ చేసింది.
TG News: పిల్లలకు వాడే సిరప్ ప్రమాదకరం.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అలర్ట్
Telangana Drugs Control : పిల్లలకు ఉపయోగించే ‘ఆల్మంట్ కిడ్ సిరప్’ వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TG DCA) ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ అనే హానికర రసాయనం కలిసినట్టు గుర్తించడంతో ఇది విషపూరితంగా మారిందని అధికారులు వెల్లడించారు.
కోల్కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి అందిన హెచ్చరిక మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సిరప్ ఎవరి వద్ద అయినా ఉంటే వెంటనే వాడకాన్ని నిలిపివేయాలని, అలాగే విక్రయాలు కూడా పూర్తిగా ఆపాలని సూచించారు.
పిల్లలకు వినియోగించే ఔషధం కావడంతో తల్లిదండ్రులు, వైద్యులు, మెడికల్ షాప్ నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కోరారు. ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత బ్యాచ్‌లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.