వ్యాక్సిన్‌ కనుగొనేంతవరకు ఇదే జీవన విధానం : డీజీపీ

కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఇప్పటివరకు లక్షల మందికి వ్యాప్తి చెందిన కరోనా వైరస్, వేల మందిని బలితీసుకుంది.

Update: 2020-05-09 10:53 GMT

కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఇప్పటివరకు లక్షల మందికి వ్యాప్తి చెందిన కరోనా వైరస్, వేల మందిని బలితీసుకుంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎన్నో దేశాలు పోటీపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ లో కోవిడ్‌-19 సంక్రమణకు గురికాకుండా రిస్క్‌ను తగ్గించుకునే మార్గాలను తెలియజేశారు.

వ్యాక్సిన్‌ కనుగొనేంత వరకు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవడం, లాంటి చర్యలను తీసుకోవాలని తెలిపారు. ప్రజలు ఇదే జీవన విధానాన్ని పాటించాలని, అప్పుడే కరోనా వైరస్ ను ఎదుర్కోగలమని ఆయన స్పష్టం చేసారు. కరోనా భారిన పడకుండా ఓ వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు వీటన్నింటిని పాటించాల్సిందిగా పేర్కొన్నారు. 




 


Tags:    

Similar News