CS Somesh Kumar: ప్రతిష్టాత్మకంగా జాతీయ సమైక్యతా దినోత్సవం
CS Somesh Kumar: మూడు రోజులపాటు జిల్లాల్లో సమైక్యతా దినోత్సవ కార్యక్రమాలు
CS Somesh Kumar: ప్రతిష్టాత్మకంగా జాతీయ సమైక్యతా దినోత్సవం
CS Somesh Kumar: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బూర్గుల రామకృష్ణభవన్‌నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యమంత్ర కేసీర్ సూచనలతో జాతీయ సమైక్యతా ఉత్సవాలను అన్ని నియోజక వర్గాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిజిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తెలంగాణ సమైక్యత దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. సమైక్యత ప్రదర్శన తర్వాత సభాకార్యక్రమాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి భద్రతా బలగాల చేత గౌరవ వందనం స్వీకరిస్తారు.