నేడు సైబర్‌క్రైం విచారణకు తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్
* అభ్యంతకర పోస్టుల్లో సునీల్ పాత్ర ఉందంటూ అభియోగాలు
నేడు సైబర్‌క్రైం విచారణకు తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్
Sunil: తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు నేడు సైబర్‌క్రైం విచారణకు హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల్లో సునీల్ పాత్ర ఉందంటూ అభియోగాలు నమోదయ్యాయి. వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు పాత్ర ఉందంటూ ఆరోపిస్తూ నిందితునిగా చేర్చాలని సైబర్ క్రైమ్ నిర్ణయించింది. ఇప్పటికే సునీల్ కనుగోలుకు CRPC 41(A) కింద CCS నోటీసులు ఇచ్చింది. దీనిని హైకోర్టులో సవాల్ చేయడంతో సునీల్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలుకు సూచించింది.