Mahbubnagar: చమురు ధరల పెంపుపై కాంగ్రెస్ నేతల నిరసన
Mahbubnagar: పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి.
చమురు ధరల పెంపుపై కాంగ్రెస్ నేతల నిరసన (ఫొటో హెచ్‌ఎంటీవీ)
Telangana: పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెట్రోల్ బంకుల ఎదుట బైఠాయించి, ఆందోళనలు చేపడుతున్నారు పార్టీ శ్రేణులు.
కరోనా లాక్‌డౌన్‌తో సామాన్యులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో నిత్యవసరాల్లో ఒకటిగా ఉన్న పెట్రోల్ ధరలను పెంచడం తగదని ఆరోపిస్తున్నారు. చమురు ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు హస్తం నేతలు.