Telangana Congress: నేడు పీఎస్‌లలో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులపై ఫిర్యాదు

Telangana Congress: రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన టీ.కాంగ్రెస్‌

Update: 2022-02-05 02:26 GMT

రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన టీ.కాంగ్రెస్‌

Telangana Congress: రాజ్యాంగంపై కేసీఆర్‌ నోరు మెదిపితే యుద్ధమేనంటున్నారు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. అంతేకాదు సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ప్రత్యేక కార్యాచరణను ప్రకటించి, ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది టీ.కాంగ్రెస్‌. రాజ్యాంగంపై కేసీఆర్‌ చేసిన మాటలను చాలా సీరియస్‌గా తీసుకున్న హస్తం నేతలు పార్లమెంట్‌ వేదికగా దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

టీ.కాంగ్రెస్‌ కేసీఆర్‌ తీరుకు నిరసనగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నేడు అన్ని జిల్లాల్లోని పీఎస్‌లలో కేసీఆర్‌, టీఆర్ఎస్‌ నాయకులపై ఫిర్యాదులు చేయనున్నారు. రేపు అన్ని అంబేద్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూజలు చేయాలని రేవంత్ రెడ్డి, మహిళా కాంగ్రెస్‌కి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సీతక్క, గీతారెడ్డి నాయకత్వంలో ట్యాంక్‌బండ్‌ వద్ద పాలాభిషేకం చేస్తామన్నారు.

అధిష్టానంతో మాట్లాడిన తర్వాత సోమవారం పార్లమెంట్ బయట.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి దీక్ష చేస్తామన్నారు రేవంత్‌. అదేవిధంగా పార్లమెంట్‌లో కేసీఆర్‌పై నిరసన తెలుపుతామన్నారు. రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతుండటంతో అన్ని పార్టీలు ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.

Tags:    

Similar News