Telangana Cold Wave Alert: నేటి నుంచి 12 వరకు తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Telangana Cold Wave Alert: తెలంగాణలో ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత.. మళ్లీ పెరగనుందని వాతావరణశాఖ వెల్లడించింది.

Update: 2026-01-05 06:09 GMT

Telangana Cold Wave Alert: నేటి నుంచి 12 వరకు తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Telangana Cold Wave Alert: తెలంగాణలో ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత.. మళ్లీ పెరగనుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గజగజ వణికించేలా చలిగాలులు వీస్తాయని, డిసెంబర్ మొదటి వారంలో ఉన్నటువంటి 'కోల్డ్‌వేవ్' పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయని పేర్కొన్నారు.

రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా 25-26 డిగ్రీల మధ్యనే నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చిరించారు.

Tags:    

Similar News