Medaram: మేడారానికి సీఎం రేవంత్‌ రెడ్డి

Medaram: కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు.

Update: 2025-09-23 05:52 GMT

Medaram: కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతర మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 150 కోట్ల వ్యయంతో సమ్మక్క సారలమ్మ మహాజాతర పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.

మేడారం పూజారులు, ఆదివాసి పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో జాతర నిర్వాహణ, కొత్త నిర్మాణాలపై సీఎం సమీక్షించనున్నారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగినట్టుగా భారీ స్వాగత తోరణాల నిర్మాణానికి ప్రభుత్వం నడుం బిగించింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

Tags:    

Similar News