Revanth Reddy: ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం
Revanth Reddy: పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం
Revanth Reddy: పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడని చెప్పారు.
ఇటీవల నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వాహణలో వీర మరణం చెందారని గుర్తు చేశారు. వారి కుంటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇలా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.