KCR Finalise New Secretariat Design: సచివాలయం భవనం డిజైన్ ఖరారు చేయనున్న కేసీఆర్!

KCR Finalise New Secretariat Design: పాత సచివాలయం భవనాన్ని కూల్చి, కొత్త సచివాలయం భవనాన్ని కట్టేందుకు మార్గం సుగమం అయింది.

Update: 2020-07-21 06:56 GMT
సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

KCR Finalise New Secretariat Design: పాత సచివాలయం భవనాన్ని కూల్చి, కొత్త సచివాలయం భవనాన్ని కట్టేందుకు మార్గం సుగమం అయింది. హైకోర్టు, సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో తెలంగాణ సచివాలయానికి అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో పాత సచివాలయ భవనం మరి కొద్ది రోజుల్లోనే పూర్తిగా నేల మట్టం కానుంది. దీంతో తెలంగాణ సర్కారు వీలైతే ఈ శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయం నిర్మాణ పనులను ప్రారంభించాలని చూస్తుంది.

ఇక కొత్త సచివాలయ భవన నిర్మాణానికి కావలసిన నూతన డిజైన్‌ను ఈ రోజు సీఎం కేసీఆర్ ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇది వరకే నూతన సచివాలయ నమూనాను విడుదల చేసింది. రూ. 500 కోట్ల వ్యయంతో నూతన సచివాలయ సమీకృత భవనాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 2లోగా నూతన సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇందుకోసం అధికారులు, చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లతో కేసీఆర్ నేడు భేటీ కానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సచివాలయ భవనం ఉండనుందని సమాచారం. ఇక పోతే కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన నమూనా ఇండో అరబిక్ శైలిలో ఉందని, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికిప్పుడు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్‌ను నిర్మించడం అవసరం ఏముందని, ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి దారుణంగా మారినా దాన్ని పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.



Tags:    

Similar News