14న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్

రైతును రాజు చేయడమే లక్యంగా టీఆర్ ఎస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

Update: 2020-06-13 07:50 GMT
సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

రైతును రాజు చేయడమే లక్యంగా టీఆర్ ఎస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో అదివారం సమావేశం కానున్నారు. నియంత్రిత సాగు విధానం, వర్షకాల పంటల ప్రణాళికపై సుధీర్ఘంగా అధికారులతో చర్చించనున్నారు. వీటితోపాటు గ్రామీణ ఉపాధి హమీ పథకం, పట్టణ పల్లె ప్రగతి వంటి అంశాలపై సమాలోచన చేయనున్నారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం. వానకాలం పంటల ప్రణాళిక, పట్టణ, పల్లె ప్రగతిపై చర్చ. సీజనల్ వ్యాధులపై యాక్షన్ ప్లాన్సమగ్ర వ్యవసాయ విధానం, నియంత్రిత సాగుపై సమాలోచన. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతిభవన్ లో సమావేశం కానున్నారు.

ఈ ఏడాది వ్యవసాయ సాగులో ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువస్తోంది. వానకాలంలో 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 70 లక్షల ఎకరాల్లో పత్తి, 15 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేయాలని నిర్ణయించారు. సోయాబిన్, పసుపు, మిర్చి పంటలను గత ఏడాది మాదిరిగానే పండించాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమాలోచన చేయనున్నారు. అలాగే ఉపాధిహమీ పథకం పనులపై జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నారు.

ఈ వానకాలంలో పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు, పరిశుభ్రతపై జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన అంశాలను ప్రస్థావించనున్నారు. వీటితో పాటు ఏజెన్సీలో ప్రజారోగ్యంపై తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు సమాచారం.


Tags:    

Similar News