Telangana Chief Minister KCR in a meeting (file image)
ఈనెల 11న ఉదయం సీఎం కేసీఆర్ మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశంకానున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, అటవీశాఖ, ఇతర శాఖల ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్దీకరణ, ట్రిబ్యునళ్ల ఏర్పాటు పార్ట్ బి లో చేర్చిన అంశాల పరిష్కారం, తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.