CEO Vikas Raj: సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు.. రేపు సాయంత్రంలోగా మునుగోడు నుంచి వారంతా వెళ్లిపోవాలి..

CEO Vikas Raj: మునుగోడు ఉపఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.

Update: 2022-10-31 12:53 GMT

CEO Vikas Raj: సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు.. రేపు సాయంత్రంలోగా మునుగోడు నుంచి వారంతా వెళ్లిపోవాలి..

CEO Vikas Raj: మునుగోడు ఉపఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తోందని ఆ తర్వాత నాన్ లోకల్ వారు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ప్రతీ బూత్ నుంచి వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. మునుగోడు పరిధిలో 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.

నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు రూ.6.80 కోట్ల నగదు, 4,560 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఫిర్యాదుల కోసం సీవిజల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈసీ నోటిసులకు కోమటిరెడ్డి రాజగోపాల్‌‎రెడ్డి ఇచ్చిన వివరణ అందిందన్నారు. పూర్తి పరిశీలన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News