Revanth Reddy: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి రెండుసార్లు..
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Revanth Reddy: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి రెండుసార్లు..
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇకపై ప్రతినెలా రెండు సార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని సీఎం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలనను మరింత వేగవంతం చేయడం, విధానపరమైన నిర్ణయాలలో ఆలస్యాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
సర్కారు వర్గాల సమాచారం ప్రకారం, ప్రతీ నెల మొదటి మరియు మూడవ శనివారాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు అవసరమైనప్పుడే క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నెలలో రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజలకు సంబంధించిన ప్రధాన అంశాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అంతేకాదు, పాలనలో పారదర్శకత, ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించేలా చర్యలు తీసుకోవడంలో ఈ తరచు సమావేశాలు సహాయపడతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన అభివృద్ధి, సంక్షేమ, పాలనాపరమైన అంశాలపై సమీక్ష చేసి, తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచిది అని భావిస్తున్నారు.