TS Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

* ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటి * దళిత బంధు అమలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై చర్చ

Update: 2021-09-16 02:45 GMT

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం(ఫోటో: ది హన్స్ ఇండియా)

TS Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ బేటీలో దళిత బంధు అమలు, నీటి పారుదల, వ్యవసాయంతో పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.

ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండాతో పాటు తేదీలను కూడా ఖరారు చేయనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇవ్వడానికి సిద్ధం కావాలని మంత్రులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.

అలాగే యాదాద్రి ఆలయ పునః ప్రారంభంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశముంది. విద్యుత్ ఉత్పత్తి అంశంపై ఏపీ చెబుతున్న అభ్యంతరాలపై సమావేశంలో చర్చకు రానుంది. అలాగే ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వివిధ శాఖల్లో 65 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయని ఆర్థికశాఖ కేబినెట్ ముందు ఉంచింది.

శాసనసభలో ఒక రోజు మొత్తం దళిత బంధుపై చర్చించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్ ప్రసాగించనున్నారు. ప్రతి ఏటా 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి, ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి దళిత బంధు పథకం వర్తించేలా క్యాబినేట్‌ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు వరిపంట సాగు గందరగోళం, సీజనల్‌ వ్యాధులపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ పనులు స్థితిగతులపై కూడా మంత్రివర్గం సమావేశంలో చర్చకు రానుంది.

Tags:    

Similar News