Portfolios of New Ministers: తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు కేటాయించే శాఖలు ఇవేనా..!

Portfolios of New Ministers: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన స‌మ‌యం వ‌చ్చేసింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎట్ట‌కేల‌కు జ‌రిగింది. ఇప్పటికే పదవుల్లో ఉన్న మంత్రులకు తోడుగా ముగ్గురు కొత్తవారికి ఈసారి అవకాశం దక్కింది.

Update: 2025-06-09 07:13 GMT

Portfolios of New Ministers: తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు కేటాయించే శాఖలు ఇవేనా..!

Portfolios of New Ministers: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన స‌మ‌యం వ‌చ్చేసింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎట్ట‌కేల‌కు జ‌రిగింది. ఇప్పటికే పదవుల్లో ఉన్న మంత్రులకు తోడుగా ముగ్గురు కొత్తవారికి ఈసారి అవకాశం దక్కింది. కొత్తగా ఎంపికైన మంత్రుల ప్రకటనకు ముందే నలుగురికి అవకాశం దొరకనుందని ప్రచారం జరిగినా, చివరికి ముగ్గురితోనే విస్తరణ ముగిసింది.

ఈసారి మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణ స్పష్టంగా కనిపించింది. మాదిగ వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కు చోటు కల్పించగా, మాల వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ వెంకటస్వామికి కూడా మంత్రిపదవి దక్కింది. బీసీ ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికు క్యాబినెట్‌లో అవకాశం కల్పించటం ద్వారా మూడు వేర్వేరు సామాజిక వర్గాలను ప్రాతినిధ్యం కల్పించారు.

మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం శాఖల కేటాయింపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణమయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశమై శాఖలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న హోం, మున్సిపల్, విద్య, పశుసంవర్థకం, కార్మిక శాఖలలో కొన్ని కొత్త మంత్రులకు బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, హోంశాఖ, ఇంటెలిజెన్స్, ట్యాపింగ్ వంటి కీలక శాఖలను వారి పరిధిలోకి తీసుకురాకపోవచ్చని సమాచారం. బదులుగా కార్మిక, పశుసంవర్థకం, మైనార్టీ, ఎస్సీ–ఎస్టీ సంక్షేమం, మైనింగ్ వంటి శాఖలు వారి బాధ్యతల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లిం మైనార్టీలకు ఈసారి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం దక్కలేదు. అలాగే ఇతర రాజకీయంగా ప్రభావశీలమైన మున్నూరు కాపులకూ మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం గమనార్హం. ఇది ఈ విస్తరణపై కొన్ని వర్గాల్లో అసంతృప్తిని కలిగించే అవకాశముంది.

Tags:    

Similar News