TS Assembly: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
TS Assembly: ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళి సై
TS Assembly: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
TS Assembly: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కాసేపట్లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలు రేపు ధన్యవాదాలు తెలుపనున్నాయి. ఈనెల 10న శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 12 నుండి వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఒక్కో రోజు ఒక్కో వ్యూహంతో ముందుకు వెళుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే అధికార పార్టీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా ఎన్నికలకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద‌్ధమైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ టార్గెట్‌గా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వచ్చిన వాటాలను చూపించడానికి రెడీ అవుతుంది.
ఇప్పటివరకు విద్యుత్, ఆర్థిక శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్.. ఈ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ నివేదికను మంత్రి ఉత్తమ్ సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇక కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను ప్రధాన ఎజెండాగా సమావేశాలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. మరో రెండు గ్యారెంటీ స్కీములు అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. సభలో ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు హామీల అమలుపై అధికార పక్షాన్ని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.