Telangana Assembly: ప్రారంభమైన కొద్దిసేపటికే తెలంగాణ అసెంబ్లీ వాయిదా.. కారణమిదే..!
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది.
Telangana Assembly: ప్రారంభమైన కొద్దిసేపటికే తెలంగాణ అసెంబ్లీ వాయిదా.. కారణమిదే..!
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే సభను వాయిదా వేయాలని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం పూర్తైన తర్వాత మినిట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంది. మంత్రులంతా కేబినెట్ సమావేశం కొనసాగుతున్నందున అసెంబ్లీని కొద్దిసేపు వాయిదా వేయాలని మంత్రి స్పీకర్ ను కోరారు. అయితే ఇందుకు స్పీకర్ సమ్మతించారు. మధ్యాహ్నం్ 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంపై సామాజిక ఆర్ధిక సర్వే నివేదిక ఫిబ్రవరి 2న రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. మరో వైపు ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఈ రెండు నివేదికలపై రాష్ట్ర కేబినెట్ లో చర్చ జరగాలి.
అందుకే మంగళవారం ఉదయం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ రెండు నివేదికలపై చర్చిస్తున్నారు. అయితే నిర్ణీత సమయానికి కేబినెట్ సమావేశం ముగియలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్ బాబు కేబినెట్ సమావేశం గురించి స్పీకర్ దృష్టికి తెచ్చారు. అసెంబ్లీని వాయిదా వేయాలని కోరారు. ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఈ రెండు అంశాలపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది.