నేడు తెలంగాణ శాసనసభ, మండలిలో చర్చ ఈ అంశాలపైనే..

తెలంగాణ అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు ఆరవరోజు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే..

Update: 2020-09-14 02:22 GMT

తెలంగాణ అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు ఆరవరోజు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే బిఎసి సమావేశం జరగనుంది. ఉభయ సభల్లో మొదట గంట సమయం ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. ఉభయసభల్లో ఈరోజు బిల్లులు ఉన్నకారణంగా స్వల్పకాలిక చర్చను రద్దు చేసింది ప్రభుత్వం. శాసన మండలి లో ప్రవేశపెట్టిన 4 బిల్లుల పై చర్చించి ఇవాళ ఆమోదం తెల్పనుంది మండలి. అలాగే మండలిలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లుల పై కూడా చర్చ జరగనుంది. ఈ సందర్బంగా తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ను మండలి ఆమోదం కోసం చర్చకు పెట్టనున్నారు సీఎం కేసీఆర్.

దీంతో పాటుగా.. తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ను ఆమోదం కోసం మండలిలో ప్రవేశపెడతారు సీఎం. మరోవైపు తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును కూడా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మండలిలో ప్రవేశ పెడతారు. ఇక పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లును కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండలిలో ప్రవేశపెడతారు.

ఇదిలావుంటే నేడు 8 కీలక బిల్లులు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి.. వాటిలో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు 2020 , తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు 2020 , తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు 2020 , తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు 2020 , తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను సవరణ బిల్లు 2020 , తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ విధానం ( టి ఎస్- బి పాస్) బిల్లు 2020 , తెలంగాణ న్యాయస్థానాల రుసుము మరియు దావాల మదింపు సవరణ బిల్లు 2020 , తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లు 2020 బిల్లులను చర్చించి ఆమోదం తెలపనుంది శాసనసభ. ఇక శాసనసభలో చర్చకు రానున్న ఆరు ప్రశ్నల వివరాలు ఇలా ఉన్నాయి..

1) కెసిఆర్ కిట్ పథకం

2) నూతన గోదాములు మరియు శీతల గిడ్డంగుల పెంపు.

3) సింగరేణి కాలరీస్ లో కారుణ్య నియామకాలు

4) ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్

5) రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు

6) షాద్ నగర్ లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు.

అలాగే శాసనమండలిలో చర్చకు రానున్న ప్రశ్నలు.

1) ప్రభుత్వ ఉద్యోగులకు కోత విధించిన వేతనాల చెల్లింపు

2) వరంగల్ మహానగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు

3) విద్యుత్తు నీరు మరియు పురపాలక పన్నుల తగ్గింపు/ మాఫీ

4) పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి.

5) జిహెచ్ఎంసి పరిధిలో లింకు రహదారులు.

6) గౌడ సామాజిక వర్గానికి కల్లుగీత లో శిక్షణ

Tags:    

Similar News