Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly: ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై
Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12.10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 6న ఉభయసభల్లో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ నెల 14వరకు సమావేశాలు జరిగే అవకాశముండగా, 3న జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్‌తోపాటు ప్రభుత్వ చీఫ్ విప్, మరో రెండు విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుత సమావేశాల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.