TS Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు
TS Assembly: ఉ.11.30 గంటలకి ప్రారంభం కానున్న ఉభయసభలు
TS Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు
TS Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకి ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం ప్రకటించనున్నారు. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానం అనంతరం సభ రేపటి వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన BAC సమావేశం జరగనుంది. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై BAC సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక శాసనమండలిలో ఇవాళ శాసనమండలిలో వర్షాలు, వరదలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.