Teenmar Mallanna: కొత్త రాజకీయ పార్టీ పెట్టిన తీన్మార్‌ మల్లన్న.. పార్టీ పేరు ఇదే!

Teenmar Mallanna: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు.

Update: 2025-09-17 10:09 GMT

Teenmar Mallanna: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అని పేరు పెట్టారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ఆవిష్కరించారు.

జెండాలో పైభాగంలో ఎరుపు, కింది భాగంలో ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. జెండా మధ్యలో ఒక కార్మిక చక్రం, దాని నుంచి పైకి లేచినట్లుగా బిగించిన పిడికిలి చిహ్నం ఉన్నాయి. ఈ చిహ్నానికి ఇరువైపులా రెండు ఆలివ్ ఆకులు ఉన్నాయి. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే నినాదం ముద్రించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న తన పార్టీ లక్ష్యాలను వివరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అధికారం, వాటా సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త పార్టీ రాకతో తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News