Hyderabad: ఇదేం పైశాచికంరా బాబూ.. మహిళను చంపి శవంపై డ్యాన్స్‌ చేసిన యువకుడు

Hyderabad: కొన్ని సంఘటనలు చూస్తుంటే సమాజంలో రోజురోజుకీ పైశాచికం పెరిగిపోతోందా అన్న సందేహం రాక మానదు.

Update: 2025-04-15 06:31 GMT

Hyderabad: ఇదేం పైశాచికంరా బాబూ.. మహిళను చంపి శవంపై డ్యాన్స్‌ చేసిన యువకుడు

Hyderabad: కొన్ని సంఘటనలు చూస్తుంటే సమాజంలో రోజురోజుకీ పైశాచికం పెరిగిపోతోందా అన్న సందేహం రాక మానదు. తాజాగా హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ యువకుడు చేసిన పనికి అంతా షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలో వెళ్లాల్సిందే.

హైదరాబాద్‌ కుషాయిగూడలో హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగుచూసింది. 70 ఏళ్ల వృద్ధురాలు కమలాదేవిని ఒక టీనేజర్‌ దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనంగా మారింది. అంతేకాదు, మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసిన అతడి చర్యలు అందరినీ షాక్‌కు గురిచేశాయి.

వివరాల్లోకి వెళ్తే… వృద్ధురాలైన కమలాదేవి ఇంట్లోనే ఓ షాపు నిర్వహిస్తున్నారు. అదే షాపులో అద్దెకు ఉంటున్నాడు నిందితుడు. ఇటీవల అద్దె సరిగ్గా కట్టకపోవడంతో కమలాదేవి అతడిని మందలించారు. దీంతో కక్ష పెట్టుకున్న ఆ టీనేజర్‌ ఏప్రిల్ 11న ఇనుపరాడ్‌తో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. తర్వాత ఆమెను చీరతో తల సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టి, మొబైల్‌ ఫోన్‌ ద్వారా మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. “ నిందితుడు ఇంటి తలుపు బయట నుంచి తాళం వేసి పారిపోయాడు. ఏప్రిల్ 13న బెంగళూరులో ఉన్న బాధితురాలి బంధువుకు నిందితుడు స్వయంగా ఫోన్ చేసి హత్య విషయాన్ని చెప్పాడు. మొదట నమ్మని ఆ బంధువుకు వీడియో పంపించాడు. దీంతో మృతిరాలి బంధువులు మాకు సమాచారం అందించారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా మృతదేహం పాక్షికంగా కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది,” అని వివరించారు.

మృతురాలు రాజస్థాన్‌కు చెందిన కమలాదేవిగా గుర్తించారు. ఆమె తన భర్తతో కలిసి మూడు దశాబ్దాల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కి వలస వచ్చారు. భర్త 15 ఏళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన కృష్ణపాల్ సింగ్‌గా గుర్తించామని, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

Tags:    

Similar News