Kadem Project: కడెం ప్రాజెక్టుకు మరో ముప్పు
Kadem Project: ప్రాజెక్టు గేట్లకు సాంకేతిక సమస్య
Kadem Project: కడెం ప్రాజెక్టుకు మరో ముప్పు
Kadem Project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు మరో ప్రమాదం తలెత్తింది. ప్రాజెక్టు గేట్లకు సాంకేతిక సమస్య తలెత్తింది. భారీగా కొట్టుకు వచ్చిన చెట్ల కొమ్మలు, చెత్త గేట్లలో పేరుకుపోయింది. దీంతో గేట్లను మూసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రాజెక్టుకు వచ్చిన వరద నీరు దిగువకు వెళ్లిపోతోంది. వచ్చిన నీరు వచ్చినట్లుగా వెళ్లిపోతుండడంతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి వెళ్లి ప్రమాదం నెలకొంది. మరమ్మతుల అనంతరం మళ్లీ గేట్లు మూసిన తరువాత వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.