Onion: కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర
Onion: కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర
Onion: కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర
Onion: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందటారు. కానీ ఈ ఉల్లి ఎప్పుడు ఎవరికి మేలు చేస్తుందో అంతుచిక్కడం లేదు. ఒక్కొసారి వినియోగదారుడికి కోయకుండానే కన్నీళ్ళు తెప్పించే ఉల్లి ఈ సారి మాత్రం సాగు చేసిన రైతుకు అమ్మకుండా కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఉల్లికి మద్దతు ధర పూర్తిగా పడిపోవడంతో మార్కెట్ లోకి తరలించేందుకు రైతులు జంకుతున్నారు. మద్దతు ధర తక్కువగా వస్తుండటంతో వ్యాపారులకు విక్రయించకుండా పండించిన ఉల్లిగడ్డను కల్లాల్లోనో, లేక తమ ఇంట్లోనో నిలువ చేసుకుంటున్నారు.
మహబూబ్‍నగర్ జిల్లాలో ఉల్లిరైతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.సాగుచేసిన ఉల్లికి మద్దతుధర దక్కకపోవడంతో ఉల్లి రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో సాగుచేసిన ఉల్లిని మార్కెట్లోకి తరలించకుండా పొలాల వద్దనో, లేక ఇంటి వద్దనో నిలువ చేసుకుంటున్నారు. మరి కొంతమంది రైతులు తక్కువ ధర వస్తున్నా ఏదో ఒక రేటుకు వ్యాపారులకు అమ్ముతున్నారు.
ధర నచ్చని రైతులు మార్కెట్లో విక్రయించకుండా, మార్కెట్ కు తెచ్చిన ఉల్లిని తిరిగి ఇంటికి తీసుకెల్తున్నారు. ఊహించని విధంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్లలోకి వివిధ ప్రాంతాల నుంచి ఉల్లి ఒక్క సారిగా రావడంతో 1800 వందల వరకూ ఉండే క్వింటాల్ ఉల్లిధర ఒక్కసారిగా 600 నుంచి 1100 వరకు పడిపోయింది
మహబూబ్‍నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ యార్డుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అదిక సంఖ్యలో ఉల్లి విక్రయానికి వచ్చింది. దేవరకద్ర మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందని మహబూబ్ నగర్, నారాయ ణపేట, ఆత్మకూర్, మక్తల్, కోస్గి, జడ్చర్ల, కొత్తకోట మండలాల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు ఇక్కడకు ఉల్లి పంటను తీసుకొచ్చారు. దీంతో ధరలు మరింత తగ్గాయి.