Srinivas: ఈటల రాజేందర్.. గెల్లు శ్రీనివాస్ ను బానిస అనడం సరికాదు
Talasani Srinivas: ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో బీసీ.. శామీర్‌పేటలో ఓసీ- తలసాని
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫైల్ ఇమేజ్)
Talasani Srinivas: ఈటల రాజేందర్.. గెల్లు శ్రీనివాస్ ను బానిస అనడం సరికాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ చిల్ల పిల్లవాడే కావచ్చు.. అయితే ఆనాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు ఈటల చిన్నవాడే కదా అన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో బీసీ.. శామీర్‌పేటలో ఓసీ అని వ్యాఖ్యానించారు. గతంలో ఆరుసార్లు కేసీఆర్ దయాదాక్షిణ్యాలపై ఈటల విజయం సాధించిన విషయం మర్చిపోయరా అని గుర్తు చేశారు.