T Congress: రాజ్‌ భవన్‌కు వెళ్లిన టీకాంగ్రెస్ నేతలు.. 64మంది ఎమ్మెల్యేల లేఖను అందించిన నేతలు

T Congress: రేపు మ.1.04లకు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు-మహేష్‌కుమార్

Update: 2023-12-06 09:21 GMT

T Congress: రాజ్‌ భవన్‌కు వెళ్లిన టీకాంగ్రెస్ నేతలు.. 64మంది ఎమ్మెల్యేల లేఖను అందించిన నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. నేతలు మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, తదితర నేతలు రాజ్‌ భవన్‌ కార్యదర్శికి సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు ఉన్న లేఖను అందజేశారు. దీంతో పాటు 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఇచ్చారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా నేతలు కోరారు. రేపు మధ్యాహ్నం 1గంట 4 నిమిషాలకు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని మహేష్‌ కుమార్ గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News