Suryapet: సూర్యాపేట జిల్లా బేతవేలులో ఆస్తికరపోటీ
Suryapet: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Suryapet: సూర్యాపేట జిల్లా బేతవేలులో ఆస్తికరపోటీ
Suryapet: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఇద్దరు నాయకులు పోటీ చేస్తుండటం ఉత్కంఠను పెంచుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి వనపర్తి రామయ్య గెలుపు కోసం బీఆర్‌ఎస్, సీపీఐ, టీడీపీలకు చెందిన స్థానిక నాయకులు,కార్యకర్తలు ఏకమయ్యారు. ఈ నాలుగు పార్టీల జెండాలు ఒకే వేదికపై ప్రచారం నిర్వహించడం గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ అరుదైన కూటమి రామయ్యకు అదనపు బలాన్ని చేకూర్చింది. కాగా కాంగ్రెస్‌లోని మరో కీలక వర్గానికి చెందిన నాయకుడు వట్టికూటి నాగయ్య కూడా బరిలో ఉన్నారు.దీంతో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులకు రెండు వేర్వేరు వర్గాలు మద్దతు ఇస్తుండటంతో పోరు అత్యంత ఉత్కంఠగా మారింది.గ్రామ స్థాయి ఎన్నికల్లోనే ఇన్ని పార్టీల కలయిక, ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం.. బేతవోలు గ్రామాన్ని సూర్యాపేట రాజకీయాల్లో ఆకర్షణ కేంద్రంగా మార్చింది.