Disha Encounter Case: ఇవాళ దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు తీర్పు

Disha Encounter Case: 2019 డిసెంబరు 6న నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్

Update: 2022-05-20 01:27 GMT

ఇవాళ దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు తీర్పు 

Disha Encounter Case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టియించిన దిశ కేసులో సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ ముగిసింది. సిర్పూర్ కర్ కమిషన్ సమర్పించిన నివేదిక పై ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దిశ అత్యాచారం, హత్య తర్వాత పోలీస్ కస్టడీలో ఉండగా జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్‌నా నిజమైన ఎన్ కౌంటర్‌నా అని నిగ్గు తేల్చనుంది సుప్రీంకోర్టు సిర్పూర్ కర్ ఇచ్చిన నివేదికలో అసలు ఏముంది. కమిషన్ ఇచ్చిన నివేదిక పై సుప్రీంకోర్టు ఎలాంటి ప్రకటన చేయనుందనే విషయమై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

యావత్ దేశం మొత్తం తీవ్ర చర్చనీయాంశంగా మారిన దిశ సంఘటన పై సుప్రీం కోర్ట్ నియమించిన జ్యూడిషియల్ కమిషన్ విచారణ ఇప్పటికే ముగిసింది. జనవరి మొదటి వారంలో దిశ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లిలో 2019 డిసెంబర్ 6న దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగానే మరణించిన ఘటనపై సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్ కర్ కమిషన్ దాదాపు 3 సంవత్సరాల పాటు విచారించింది. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబ సభ్యులు, 18 మంది సాక్ష్యులను, ఎన్ కౌంటర్ పాల్గొన్న పోలీస్ అధికారులు, అప్పటి కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ డిసిపి గా ఉన్న ప్రకాష్ రెడ్డి, సిట్ అధికారి మహేష్ భగవత్, జాతీయ మానవ హక్కుల సభ్యుల నివేదికలలోని అన్ని అంశాలను నమోదు చేసుకుని తుది నివేదికను సిద్ధం చేసి సుప్రీంకోర్టు కు సీల్డ్ కవర్ లో సమర్పించింది కమిషన్.

ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిణామాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రీపోర్ట్ ను 2020 ఫిబ్రవరి 25 సిట్ చీఫ్ మహేష్ భగవత్ కమిషన్ సభ్యులకు అందజేశారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలున్నాయని నిందితుల కుటుంబ సభ్యులు కమిషన్‌కు అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఇప్పటి వరకు కమిషన్ ముందు మొత్తం 1,365 అఫిడవిట్ లు దాఖలు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులు, బాధిత కుటుంబ సభ్యులు, 18 మంది సాక్ష్యులను కమిషన్ విచారించింది. ఇప్పటివరకు ప్రజల నుంచి 1,333, పోలీసులు, అధికారుల నుంచి 103 అఫిడవిట్లపై కమిషన్ విచారించింది. సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక సమర్పించిన అనంతరం కమిషన్ విచారణ గోప్యంగా ఉంచాలని తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును కోరారు. గోప్యత పాటించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా వేసిన కోర్టు నేటి విచారణలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News