Sunke Ravishankar: 9 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది
Sunke Ravishankar: అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి
Sunke Ravishankar: 9 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది
Sunke Ravishankar: జగిత్యాల జిల్లాలో చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కొడిమ్యాల మండలం కట్టకింది గోపాల్‌రావు పేట, అప్పారావుపేట, సంద్రాలపల్లి గ్రామాల్లో రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 9 ఏళ్ల క్రితం రాష్ట్రం ఏవిధంగా ఉందో.. ఇప్పుడు ఏవిధంగా ఉందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని రవిశంకర్ కోరారు. ఏ శాసనసభ్యులు చేయని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఎందుకని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.