Birla Ilaiah: తెలంగాణలో నాయకులే అభివృద్ధి అయ్యారు
Birla Ilaiah: సొంత గ్రామాన్ని సునీత అభివృద్ధి చేయలేదు
Birla Ilaiah: సొంత గ్రామాన్ని సునీత అభివృద్ధి చేయలేదు
Birla Ilaiah: తొమ్మిదిన్నర సంవత్సరకాలంలో దగా పడ్డాం... మోసపోయామని ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల అయిలయ్య అన్నారు. తెలంగాణలో నాయకులే అభివృద్ధి అయ్యారు తప్ప గ్రామాలు, ప్రజలు అభివృద్ధి కాలేదని తెలిపారు. తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి అందాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్ కుటుంబం , మంత్రులకే సంపద పోతుందని బీర్ల అయిలయ్య ఆరోపించారు. యాదగిరి గుట్ట మండలం వంగపల్లిలో బీర్ల అయిలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సొంత గ్రామాన్ని ఎమ్మెల్యే గొంగిడి సునీత అభివృద్ధి చేయలేదని...సునీత కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని...ఈసారి తనకు ఓటు వేసి గెలిపించాలని వంగపల్లి గ్రామ ప్రజలను కోరారు.