హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Update: 2019-11-02 14:42 GMT
software employee suicide

హైదరాబాద్ సిటీలో భర్త వేధింపుల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకున్నది. అంబర్ పేటకు చెందిన సుకీత్, కార్వాన్ కు చెందిన శివాని ఐదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. సుకీత్ మరో మహిళతో సంబంధం పెట్టుకుని.. భార్య శివానిని వేధించడం మొదలుపెట్టాడు. ఆరు నెలలుగా వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్లు శివాని తన కుటుంబ సభ్యలకు చెప్పింది. నువ్వు చనిపోతే నేను మరో పెళ్లి చేసుకుంటా అంటూ సుకీత్ భార్యను అదేపనిగా వేధించడంతో జీవితంపై విరక్తి చెందిన శివాని రాత్రి ఉరేసుకుంది. తనతో మాట్లాడిన కొద్ది సేపటికే శివాని ఆత్మహత్య చనిపోయినట్లు సుకీత్ ఇంటి నుంచి ఫోన్ వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త వేధింపులే శివాని ఆత్మహత్యకు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Full View

Tags:    

Similar News