ఖాకీ వీరంగం.. ఓ వ్యక్తి ముఖంపై బూటు కాలితో తన్నిన ఎస్సై

Gadwal: తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నతాధికారుల మాటల వరకేనా కిందిస్థాయి ఖాకీల్లో మాత్రం ఇది జరగట్లేదా..?

Update: 2021-09-27 11:51 GMT

ఖాకీ వీరంగం.. ఓ వ్యక్తి ముఖంపై బూటు కాలితో తన్నిన ఎస్సై 

Gadwal: తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నతాధికారుల మాటల వరకేనా కిందిస్థాయి ఖాకీల్లో మాత్రం ఇది జరగట్లేదా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిన్న జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో ఓ వ్యక్తిని పోలీసులు కుళ్లబొడిచిన వీడియో కలకలం రేపుతోంది. నేను పోలీస్‌ని అనే అహంకారం అతడి చేష్టలతో బట్టబయలైంది. ఎదురుగా ఉన్నది కూడా మనిషే అన్న కనీస స్పృహ లేకుండా బూటు కాలితో అతన్ని తన్నిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

కర్నూల్ నగరం పాతబస్తీకి చెందిన లక్షణ్ స్నేహితుడితో కలిసి చికెన్ తినడానికి రాజోలి వెళ్లాడు. రాజోలిలో చికెన్ కొని పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లాడు. ఇదే సమయంలో అటువైపు వచ్చిన రాజోలి ఎస్‌ఐ లెనిన్ అతని సిబ్బంది లక్ష్మణ్‌, అతడి స్నేహితుడితో వాగ్వాదానికి దిగారు. అసలేం తప్పుచేశామని ప్రశ్నించిన లక్ష్మణ్ ను నానా దుర్భాషలాడారు. చేసేదిలేక పోలీస్ వాహనానికి తలకొట్టుకుని చనిపోతానని లక్ష్మణ్ పోలీసులను హెచ్చరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎస్‌ఐ లెనిన్ లక్ష్మణ్‌ తలపై, ముఖంపై ఎడాపెడా బూటు కాలితో తన్నాడు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎస్‌ఐ లెనిన్ లక్ష్మణ్‌పై తప్పుడు కేసులు బనాయించి రిమాండ్‌లో పెట్టినట్లు స్నేహితులు ఆరోపిస్తున్నారు. బాధితుడిపై 332, 353, 504 సెక్షన్స్ ప్రకారం కేసులు పెట్టారు. లక్ష్మణ్ మద్యం సేవించి కారు అద్దాలను పగలగొట్టాడనే ప్రచారం ప్రారంభించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాధితుడు లక్ష్మణ్‌ను లెనిన్ కాలితో తన్నడం హాట్‌టాపిక్ గా మారింది. పోలీసు అధికారి అయిఉండి తప్పు చేస్తే అరెస్టు చేయాలి కానీ ఇలా వ్యక్తిగత దాడికి దిగడమేంటని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు ఇప్పటికైనా ఇలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటకి అర్ధమే లేకుండా పోతుందంటున్నారు.

Tags:    

Similar News