Warangal: వరంగల్‌లో వీధికుక్కల హల్ ఛల్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను గాయపరచిన కుక్క

Warangal: రాజమ్మ అనే వృద్ధురాలిపై కుక్కలు దాడిని అడ్డుకోబోయిన కానిస్టేబుల్

Update: 2023-06-13 03:33 GMT

Warangal: వరంగల్‌లో వీధికుక్కల హల్ ఛల్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను గాయపరచిన కుక్క

Warangal: వీధి కుక్క దాడిలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తోపాటు పలువురు గాయపడిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టవాడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీను బట్టల బజార్లో విధులు నిర్వహిస్తున్నారు. అటుగా వెళుతున్న రాజమ్మ అనే వృద్ధురాలిని కుక్కలు దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనుపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

గాయపడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను, రాజమ్మ తో పాటు కాశిబుగ్గకు చిందిన నవీన్, కాజీపేట కు చెందిన పర్వేజ్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితులను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఇప్పటికే అనేకసార్లు కుక్కల దాడి ఘటన జరుగుతున్న నిద్రమత్తులో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు పై జంగా రాఘవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News