తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న వీధికుక్కలు

* మంచిర్యాల జిల్లా మందమర్రిలో వీధికుక్కల బీభత్సం

Update: 2023-02-28 07:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న వీధికుక్కలు

Mancherial: తెలుగు రాష్ట్రాల్లో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. ప్రతిరోజు ఏదొక మూల వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. అంబర్‌పేట్‌లో కుక్కల దాడి ఘటనలో బాలుడి మృతి ఘటన మరువకముందే.. అలాంటి మరిన్ని ఘటనలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా.. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. వరుసగా 15 మందిపై కుక్కల గుంపు దాడి చేసింది. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ.. పాదచారులు, వాహనాలపై వెళ్లేవారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు కావడంతో.. బాధితులు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News