Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో దారుణం.. వీధి కుక్కల దాడి
Hyderabad: వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి
Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో దారుణం.. వీధి కుక్కల దాడి
Hyderabad: దారుణం పిల్లాడిని చంపేసిన కుక్కలు,అంబర్పేట్ లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బాగ్ అంబర్పేటలో ఉంటున్న గంగాధర్.. ఆదివారం సెలవు కావడంతో కూతురు, కుమారుడు ప్రదీపు తాను పనిచేసే సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లాడు. పనిమీద గంగాధర్ అక్కడి నుంచి వెళ్లగా, ప్రదీప్ నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. కుక్కలు అతడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. నోట కరచుకుని రెండు కుక్కలు చెరోవైపు లాగడంతో ప్రదీప్ చనిపోయాడు.
నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ ఉపాధి నిమిత్తం నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. భార్య, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడితో కలిసి బాగ్అంబర్‌పేటలో ఉంటూ అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన పిల్లలను గంగాధర్ సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. కూతురిని పార్కింగ్ ప్రదేశం వద్ద క్యాబిన్‌లో ఉంచాడు. కొడుకును తీసుకుని సర్వీస్ సెంటర్ లోపలికి వెళ్లాడు. అక్కడ కుమారుడు ఆడుకుంటుండగా మరో వ్యక్తితో కలిసి గంగాధర్ పని మీద వేరే చోటకు వెళ్లాడు. కొద్దిసేపు అక్కడ ఆడుకున్న చిన్నారి తన అక్క వద్దకు వెళ్లాలని అనుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కులు అతడి వెంటపడ్డాయి. బాలుడు భయంతో అటూ ఇటు పరుగులు తీశాడు. అయినప్పటికీ అవి అతడిని వదలలేవు. ఒకదాని తరువాత మరొకటి ఆ బాలుడిపై దాడి చేయడంతో చిన్నారి మృతి చెందాడు.