Stray Dogs: సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం.. ఒకే రోజు 23 మందిపై కుక్కల దాడి
Stray Dogs: గత 24 గంటల్లో అందోల్, జోగిపేట మున్సిపల్ పరిధిలో ఒకే రోజు 23 మందిపై కుక్కలు దాడి చేశాయి.
Stray Dogs: సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం.. ఒకే రోజు 23 మందిపై కుక్కల దాడి
Stray Dogs: సంగారెడ్డి జిల్లా అందోల్, జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే అంతే సంగతి. గత 24 గంటల్లో అందోల్, జోగిపేట మున్సిపల్ పరిధిలో ఒకే రోజు 23 మందిపై కుక్కలు దాడి చేశాయి. గాయపడ్డవారు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీధుల్లో కుక్కలు కనిపిస్తే చాలు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్ల వెంబడి నడవాలంటే జంకుతున్నారు. అయినా అధికారులు మాత్రం వీటి నియంత్రణను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అందోల్ జోగిపేట మున్సిపల్ అధికారులు వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.