Siddipet: సిద్దిపేట అదనపు కలెక్టర్‌కు కుక్కకాటు..
Siddipet: అదనపు కలెక్టర్‌పై దాడిచేసిన కుక్క
Siddipet: సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్‌లో కుక్కల స్వైరవిహారం
Siddipet: కుక్కకాటు ఘటనలు తెలంగాణను వదలడం లేదు. హైదరాబాదులో ఓ చిన్నారిని వీధి కుక్కలు కరిచి చంపిన ఘటన తర్వాత వరుసగా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చి.. భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే సిద్దిపేట కలెక్టరేట్‌లో వెలుగు చూసింది. సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్‌లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కుక్క కాటుకు గురయ్యారు. తాముంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో వీధి కుక్క కరిచింది. దీంతో శ్రీనివాసరెడ్డికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుక్కని తరిమికొట్టి ఆయనని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.